Friday, March 28, 2014

ప్రపంచంలో 20 గొప్ప అబద్ధాలు


1. ఇంత ఘనం ఎప్పుడూ తాగలేదు.
2. హా.. బాగానే ఉన్నా.
3. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
4. మీరు సన్నగానే ఉన్నారు. మీ బట్టల వల్లే లావుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.
5. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
6. దయచేసి లైన్‌లో ఉండండి. మా కస్టమర్‌ కేర్‌ రిప్రజెంటేటివ్‌ మీతో మాట్లాడతారు.
7. పది మందిలో తొమ్మిది మంది అదే చెప్పారన్న సర్వే...
8. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి.
9. మీరు కావాల్సినంత బరువు కోల్పోతారు.
10. నేను డైవర్స్‌ తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను.
11. లేదు లేదు నేను కాసేపట్లో కాల్‌ చేస్తాను.
12. నిజంగా నాకు తెలియదు ఎవరు అలా చేశారో.
13. నాకు తెలుసు అది నా పని కాదని.
14. అది నా వ్యసనం కాదు. నేను ఎప్పుడంటే అప్పుడు సిగరెట్‌ మానెయ్యగలను.
15. నిజం నన్ను నమ్ము.
16. ప్రత్యేకంగా మీ కోసమే చేశా.
17. చెక్కు మెయిల్‌ చేశాను.
18. నేను గవర్నమెంట్‌ సర్వెంట్‌ని, మీకు సహాయం చేయడానికి వచ్చాను.
19. హే! నేను ఆ డబ్బులు నీకు ఇచ్చేశాననుకుంటా.
20. మీకు ప్రామిస్‌ చేస్తున్నాను. వచ్చే శుక్రవారం తప్పకుండా ఇస్తాను.

if u like this article click here to like our fan page 



Wednesday, March 26, 2014

మాకు లాజిక్ లు వద్దు.. మ్యాజిక్ లే కావాలి...



వన్ ఫైన్ మార్నింగ్..
మినీ ట్యాంక్ బండ్, సరూర్‌నగర్.
‘‘
ఏంటంకుల్ అంతలా ఆలోచిస్తున్నారు? మీ ఇంటి పై కప్పులు ఏ రేకుల్తో వేద్దామా అనా?’’ బెంచీ మీద కూర్చున్న ఒకాయణ్ణి అడిగాడు ఒక కుర్రాడు.
‘‘
ఓహ్.. నువ్వా శ్రవణ్? అదీ.. మా ఇంటి పై కప్పుల గురించి కాదు.. మా వాడ్ని ఎలా పైకి తీసుకురావాలా? అని’’
‘‘
అరె... ఏమైందంకుల్ వాడికి?’’
‘‘
ఏముంది.. నువ్వు చూడు మంచి ఉద్యోగం చేస్తున్నావ్. వాడికి నీలా పైకొచ్చేందుకు ఒక్క మంచి లక్షణం లేదు. రాత్రి రెండింటి దాక కంప్యూటర్ ముందు.. పొద్దున పదింటికి లేవడం. కాస్త తెల్లారిగట్లయినా లేచి ఏడ్వరా అంటే.. ‘తెల్లారి గట్ల కోడి కూడా లేస్తది. ఏం బాగుపడింది. చికెన్ వండుకుని తినేస్తున్నమ్’ అని సినిమా డైలాగులు చెప్తున్నడు.’’
‘‘
లేదంకుల్ వాడు....’’ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు శ్రవణ్.
‘‘
నీ వయసులో ఉన్న శ్రవణ్ చూడు నెలకు 50 వేలు సంపాదిస్తున్నాడు’ అని ‘నీ గురించి చెబితే.. ‘నీ వయసులో ఉన్న బిల్‌గేట్స్ మిలియనేర్ అయ్యాడు. మరి నువ్వు?’ అని కౌంటర్లు ఇస్తున్నాడు’’
‘‘
లేదంకుల్.. వాడి గురించి నాకు తెలుసు.. చూడండి వాడు గొప్ప వాడవుతాడు..’’
‘‘
వాడేం బాగుపడతాడు. వాడ్ని చూసి వాడి చెల్లీ అలానే తయారవుతోంది. ‘కష్టపడి చదువుకోవే పైకొస్తావ్’ అంటే.. కష్....ష్టపడుతూ చదవడమెందుకు డాడీ! సింహం రోజూ 18 గంటలు పడుకుంటది. గాడిద రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తది. కష్టపడి పనిచేయడం వల్ల పైకి వస్తారంటే అడవికి గాడిద ఎప్పుడో రాజు అయి ఉండాలి కదా. మరి కాలేదెందుకు? అందుకే కష్టపడి కాదు.. కాస్త ‘దీన్ని’ ఉపయోగించాలి’’ అంటూ దిమాక్ చూపించింది’’
‘‘
అంకుల్! జనరేషన్ మారిందంకుల్. మా యూత్ ఇంతే. ఇలానే ఆలోచిస్తుంది. If hard work is what which makes u successful than all labourers would have been as rich as Mukesh Ambani1 (హార్డ్‌వర్కే మనిషి సక్సెస్‌కి కారణమయితే.. కూలీ పని చేసేవారందరూ ముఖేష్ అంబానీలా ధనికులవ్వాలి కదా?) అని రామ్‌గోపాల్ వర్మ అంతటోడు ట్విట్టర్‌లో రాశాడు’’
‘‘
ముఖేష్ అంబానీ అంత కాకపోవచ్చు. కానీ కష్టపడి పనిచేసేవాడు ఎప్పటికీ చెడిపోడు!’’
‘‘
కరక్టే అంకుల్ కాదనను. మీ వాడు నాలా ఉద్యోగం సంపాదించి.. జీవితాంతం కేవలం ‘ఉద్యోగి’గానే మిగిలిపోవాలనుకోవడం లేదు.. వాడి ఆలోచనలు వేరు...’’
‘‘
వాడి బొంద ఆలోచనలు.. ఆరు నూరయినా వాడు బాగుపడడు?’’
‘‘
ఆరు నూరవుతుంది.. అని వాడు నాకు ప్రూవ్ చేసి చూపించాడు. అంకుల్! కుందేలు గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. తాబేలు గంటకు 4.8 మీటర్లే నడుస్తుంది. కానీ ప్రతిసారీ కుందేలే గెలవదంకుల్. చిన్నప్పుడు మీరు చెప్పిన తాబేలు - కుందేలు కథలో తాబేలే ఎందుకు గెలిచింది?’’
‘‘
నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ లేదు’’
‘‘
నిజమే అంకుల్. మాకు లాజిక్‌లు అక్కర్లేదు. మ్యాజిక్‌లనే నమ్ముతాం. జీవితంలో ఏదో మ్యాజిక్ జరగాలి. మీ వాడు అలాంటి మ్యాజిక్ ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. వాడు చేస్తాడు. నాకు నమ్మకం ఉంది’’
‘‘
నీది అపనమ్మకం. ఏం తెలుసని వాడికి. ‘పెద్దల మాట చద్ది మూట’ అంటారు. మేం చెప్పేది మీరు వినరా?’’
‘‘
అంకుల్ ఇవి చద్దన్నం తినే రోజులా? పిజ్జాలు బర్గర్లు తినే కాలం.. ఏం పెద్దల మాట అంకుల్? ‘నిదానమే ప్రధానం’ అంటారు.. ‘ఆలస్యం.. అమృతం విషం’ అని కూడా మీరే అంటారు.. మీరు చెప్పే మాటల్లో మీకే క్లారిటీ ఉండదా?’’
‘‘
అంటే... మేం పనికిరాని వాళ్లమనా?’’

‘‘సారీ అంకుల్ నేను అలా అనడం లేదు.. మీరు చెప్పేది ఈ-మెయిళ్ల కాలంలో ఇన్‌ల్యాండ్ లెటర్ రాయమన్నట్లు ఉందంటున్నాను. మా జనరేషన్‌ని అర్థం చేసుకొమ్మంటున్నాను’’
‘‘
రాసే విధానం వేరుకావొచ్చు. కానీ ఈమెయిల్ అయినా ఇన్‌ల్యాండ్ లెటర్ అయినా వాడేది ఒకే పనికి. ఎలా రాయాలో మీకు తెలిసినా ఏం రాయాలో చెప్పాల్సింది మాత్రం మేమే.’’
‘‘
కావొచ్చంకుల్. మీరు అనుభవజ్ఞులే కాదనను. వర్షంలో తడిస్తే మీకు జలుబు చేసిందని మమ్మల్నీ తడవొద్దంటారా? భయమేస్తుందని హర్రర్ సినిమాలు చూడొద్దంటారా? మేమూ తడుస్తాం.. భయపడతాం.. నేర్చుకుంటాం..’’
‘‘
అయితే మీ ఇష్టమా? అన్నీ అలానే నేర్చుకుంటారా? మేం అవసరం లేదా?’’
‘‘
లేదంకుల్ మాకు సైన్స్ కావాలంటే ఇంటర్‌నెట్‌లో దొరుకుతుంది. కానీ సంస్కారం మాత్రం మీరే నేర్పాలి.’’
p.s. :
1) రామ్‌గోపాల్ వర్మ @RGVzoomin, 24 మార్చి , 2012, 8:26 PM
2) a = b
అనుకుని రెండింటినీ 94తో బాగించండి. అప్పుడు 94a = 94b అవుతుంది.
(100-6)a = (100-6)b
100a - 6a = 100b - 6b
100(a-b) = 6(a-b)
ఎడమవైపు (a-b)కి కుడివైపు (a-b) క్యాన్సిల్ అవుతుంది.
100 = 6
అంటే ఆరు నూరవుతుంది.

if u like this article click here to like our fan page 

Wednesday, March 5, 2014

థ్యాంక్స్ ఫర్ 200


జింకీ మ్యాగ్.. కూడలిలో చేరిన రెండు రోజుల్లోనే 200 పేజ్ వ్యూస్ ని సాధించింది. 3వ తేదీన లాంచ్ చేసిన జింకీ లోగోని 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు.. 111 మంది 5 దేశాల నుంచి వీక్షించారు. మిగిలిన పేజీల వ్యూస్.. కలిపి రెండు వందలకు చేరుకున్నాం. యువతరం (జింకీ టీమ్) చేస్తున్న ఈ తొలి ప్రయత్నాన్నిని ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.

జింకీ ఫేస్ బుక్ పేజీని వీక్షించాలనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేయండి.
www.fcaebook.com/zinkymag

Like for support.. Share for report..

thanking you

ZinkY Team


Thursday, February 27, 2014

Youth Speak... We Publish : Write For Us


ఎక్స్ టెన్సివ్ మ్యానర్ లో ఓపెన్ గా, కాలేజ్ లను కనెక్ట్ చేసే యూత్ మీడియా ఉంటే బావుంటుందని జింకీ భావిస్తోంది. అందుకే మీకోసం జింకీ 30 పర్సెంట్ కంటెంట్ స్పేస్ ని ఇస్తోంది.
జింకీలో ఎవరైనా తమ కథలు, వ్యాసాలు, ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. మీరు రాసిన ఆర్టికల్ ని మన ఎడిటోరియల్ బోర్డ్ కి email ద్వారా పంపించొచ్చు. ప్రచురించడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ.. మీది పబ్లిష్ చేయడానికి పనికి రానిది అని మాత్రం కాదు. మీది ప్రాసెస్ లోనే ఉంటుందని గమనించగలరు. 
1. Fill up the form below.
2. Get an email with instructions to submit your article.

మీ ఆర్టికల్ సబ్ మీట్ చేసే ముందు ఈ విషయాలు ఒకసారి చదవండి.
జింకీకి రాస్తే డబ్బులిస్తారా?
లేదు. డబ్బులు రావు. కానీ జింకీ ప్రింట్ వెర్షన్ లో మీ ఫీచర్ వస్తుంది. అందుకు క్రెడిట్ ఇస్తాం. మీకిష్టమయితే పేరు, ఫోటోగ్రాఫ్ కూడా ప్రచురిస్తాం.
ఎక్కడ పబ్లిష్ చేస్తారు?
మీ ఆర్టికల్ సబ్ మీట్ చేసిన తర్వాత.. దాన్ని ప్రింట్, వెబ్ వర్షన్లకు కన్సిడర్ చేసినట్లే. ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టికల్స్ మాత్రమే ప్రింట్ వెర్షన్ కి వెళ్తాయి. మిగిలినవి వెబ్ సైట్ లో మాత్రమే ఉంటాయి. యాప్ ద్వారా అప్ డేటెడ్ గా కనిపిస్తూ ఉంటాయి. ప్రింట్ లో ఉన్నవి కూడా వెబ్ సైట్ మీద ఉంటాయి. కాకపోతే ప్రింట్ వర్షన్ వచ్చిన నెల రోజుల వరకు మాత్రమే ఉంటాయి.
How can I know if I am eligible for submitting an article?
If you are a student, you are eligible. If you are in young age, yor are eligible.
Will ZinkY become the owner of my article?
లేదు. మీ ఆర్టికల్ కి మీరే ఓనర్. కానీ మీ ఆర్టికల్ సెలెక్ట్ అయి పబ్లిష్ అయిన దానికి మాత్రం మా రైట్స్ ఉంటాయి. మీరు ఆర్టికల్ పంపినప్పుడే దానికి సంబంధించిన రాయల్టీలు, ఫ్రీ రైట్స్ ఇస్తున్నట్లు లెక్క.
ఎలాంటి ఆర్టికల్స్ రాయాలి?
ఎలాంటివైనా రాయండి. మైండ్ లో అనిపించినవి బ్లైండ్ గా రాసేయడమే. నో కిడ్డింగ్. పటిక్యులర్ గా చెప్పాలంటే ZinkY వెబ్ సైట్లో కనిపించే ఏ మెనూకైనా మీరు రాయొచ్చు.  
Is there a word limit?
యస్. మీరు రాసింది ఎంత చిన్నదయినా ఫర్వాలేదు కానీ 1500 పదాలకు మించినది మాత్రం కాకూడదు.
అంత కంటే ఎక్కువుంటే ఏం చేయాలి?
మీరు పంపండి. మేం కాస్త ఎడిట్ చేస్తాం. కంటెంట్ మాత్రం మార్చం బాస్. వెబ్ సైట్ లో యాజ్ ఇట్ ఈజ్. ప్రింట్ లో మాత్రం.. కట్టింగ్ తప్పదు.
పంపిన ప్రతిదీ పబ్లిష్ చేస్తామన్న గ్యారెంటీ ఉందా?
లేదు. అలాంటి గ్యారెంటీ లేదు.
నేను రాసిన ఆర్టికల్ ఎప్పుడు పబ్లిష్ అవుతుంది?
సారీ.. ఇప్పుడే చెప్పలేం.
మేం రాసింది ఎడిట్ చేస్తారా?
యస్. ఎడిట్ చేస్తాం. ప్రూఫ్ రీడింగ్ ఉంటుంది. గ్రామర్ చూసి గ్లామర్ సెట్ చేస్తాం. కానీ మీ కాన్సెప్ట్ మాత్రం మార్చం.
ఓకే.. నాకు మొత్తం అర్థమైంది? మరెలా మొదలు పెట్టాలి?
ఇందుకోసం త్వరలో ప్రారంభం కానున్న జింకీ వెబ్ సైట్ ని సందర్శించండి. 

Who runs ZinkY?


ZinkY magazine is looking for New and Fresh Talent.

జింకీని నడుపుతున్నది తల పండిన మేథావులు కాదు. మీలాంటి వాళ్లే. మీకు రాయాలని ఉందా? అయితే మీరూ జింకీలో భాగమే. కేవలం రాతలే కాదు. మీ ఆలోచనలను, ఐడియాలనూ జింకీతో పంచుకోవచ్చు. జింకీకి ఓ టీమ్ ఉంది. మీరూ అందులో చేరొచ్చు. జింకీకి ప్రతి కాలేజీలో రిపోర్టర్లు ఉన్నారు. ప్రతి క్యాంపస్ లో కరెస్పాండెంట్లను కూడా నియమిస్తోంది. మీరూ మీ కాలేజ్ కరస్పాండెంట్ కావొచ్చు.
మా టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే త్వరలో ప్రారంభం కానున్న జింకీ వెబ్ సైట్ ని క్లిక్ చేయండి. పూర్తి వివరాలు మీకు దొరుకుతాయి? 

Why ZinkY?


జింకీ అనేది యూత్ కోసం యూత్ నడుపుతున్న ఇన్నోవేటివ్ మ్యాగజైన్. ఇది యువతరాన్నే కాదు, ప్రతి ఒక్క కాలేజీనీ కలుపుతుంది. ప్రతి విద్యార్థి ఇందులో తన వాయిస్ వినిపించొచ్చు. మీరు రాయండి. మేం పబ్లిష్ చేస్తాం. మీకు ఆసక్తి ఉంటే మా టీమ్ లో కూడా చేరొచ్చు. మీరు అనుభవం ఉన్న వారై ఉండక్కర్లేదు. మీ మనసులో ఉన్నది మాతో, మన నెట్ వర్క్ తో పంచుకోవాలనుకుంటే చాలు. మీ ఆలోచనలకు, ఆసక్తులకు, ఆకాంక్షలకు, అభిప్రాయాలకు జింకీ ఒక వేదిక. యూ రైట్.. వి పబ్లిష్... Because, This is your magazine. 

Wednesday, February 26, 2014

For the youth, by the youth, to the youth.

ZinkY is an interactive invention for telugu youth. 

ZinkY.. means Zero Ink Youth.

తెలుగు యూత్ కోసం తొలి మీడియా ZinkY. యువతరం Like చేసే అంశాలతో అందంగా డిజైన్ చేసిన అల్టిమేట్.. ఆల్ట్రా మోడ్రన్.. మ్యాగజైన్ మీ ముందుకు వస్తోంది. జింకీ ఎప్పుడూ హెడ్ లైన్స్ రాయదు. బ్రేకింగ్ న్యూస్ ఇవ్వదు. ఐస్ ఆన్ ది కేక్ టైప్ లో గ్రామర్ కు గ్లామర్ యాడ్ చేసి యంగ్ ఫ్లేవర్ తో ఎంటర్ టైన్ మెంట్ వేలో ఖతర్నాక్ కంటెంట్ ఇందులో ఉంటుంది. చాదస్తపు రాతలు ఉండవు. సరిహద్దుల గీతలూ కనబడవు. ఇక్కడ నో రూల్స్. మన వార్తల్ని మన స్టయిల్లో చదువుకుందాం. మనకో లింగో ఉంది. పేపర్ లో న్యూస్ బోర్ చదవబుల్ గా లేకపోతే ఇటు రండి. టీవీ లో వ్యూస్ చూడబుల్ గా లేకపోతే ఇక్కడ క్లిక్ చేయండి. ఫేస్ బుక్ లో ఫేస్ పెట్టినట్లు.. ట్విట్టర్ లో ట్వీట్ కొట్టినట్లు రాసుకుందాం. రండి.. రచ్చ రచ్చ చేద్దాం.

coming soon..

like the page.. share the buzz.. and we will roooooooooooccccccccckkkkkkkkkk DUDES.