Thursday, February 27, 2014

Youth Speak... We Publish : Write For Us


ఎక్స్ టెన్సివ్ మ్యానర్ లో ఓపెన్ గా, కాలేజ్ లను కనెక్ట్ చేసే యూత్ మీడియా ఉంటే బావుంటుందని జింకీ భావిస్తోంది. అందుకే మీకోసం జింకీ 30 పర్సెంట్ కంటెంట్ స్పేస్ ని ఇస్తోంది.
జింకీలో ఎవరైనా తమ కథలు, వ్యాసాలు, ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. మీరు రాసిన ఆర్టికల్ ని మన ఎడిటోరియల్ బోర్డ్ కి email ద్వారా పంపించొచ్చు. ప్రచురించడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ.. మీది పబ్లిష్ చేయడానికి పనికి రానిది అని మాత్రం కాదు. మీది ప్రాసెస్ లోనే ఉంటుందని గమనించగలరు. 
1. Fill up the form below.
2. Get an email with instructions to submit your article.

మీ ఆర్టికల్ సబ్ మీట్ చేసే ముందు ఈ విషయాలు ఒకసారి చదవండి.
జింకీకి రాస్తే డబ్బులిస్తారా?
లేదు. డబ్బులు రావు. కానీ జింకీ ప్రింట్ వెర్షన్ లో మీ ఫీచర్ వస్తుంది. అందుకు క్రెడిట్ ఇస్తాం. మీకిష్టమయితే పేరు, ఫోటోగ్రాఫ్ కూడా ప్రచురిస్తాం.
ఎక్కడ పబ్లిష్ చేస్తారు?
మీ ఆర్టికల్ సబ్ మీట్ చేసిన తర్వాత.. దాన్ని ప్రింట్, వెబ్ వర్షన్లకు కన్సిడర్ చేసినట్లే. ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టికల్స్ మాత్రమే ప్రింట్ వెర్షన్ కి వెళ్తాయి. మిగిలినవి వెబ్ సైట్ లో మాత్రమే ఉంటాయి. యాప్ ద్వారా అప్ డేటెడ్ గా కనిపిస్తూ ఉంటాయి. ప్రింట్ లో ఉన్నవి కూడా వెబ్ సైట్ మీద ఉంటాయి. కాకపోతే ప్రింట్ వర్షన్ వచ్చిన నెల రోజుల వరకు మాత్రమే ఉంటాయి.
How can I know if I am eligible for submitting an article?
If you are a student, you are eligible. If you are in young age, yor are eligible.
Will ZinkY become the owner of my article?
లేదు. మీ ఆర్టికల్ కి మీరే ఓనర్. కానీ మీ ఆర్టికల్ సెలెక్ట్ అయి పబ్లిష్ అయిన దానికి మాత్రం మా రైట్స్ ఉంటాయి. మీరు ఆర్టికల్ పంపినప్పుడే దానికి సంబంధించిన రాయల్టీలు, ఫ్రీ రైట్స్ ఇస్తున్నట్లు లెక్క.
ఎలాంటి ఆర్టికల్స్ రాయాలి?
ఎలాంటివైనా రాయండి. మైండ్ లో అనిపించినవి బ్లైండ్ గా రాసేయడమే. నో కిడ్డింగ్. పటిక్యులర్ గా చెప్పాలంటే ZinkY వెబ్ సైట్లో కనిపించే ఏ మెనూకైనా మీరు రాయొచ్చు.  
Is there a word limit?
యస్. మీరు రాసింది ఎంత చిన్నదయినా ఫర్వాలేదు కానీ 1500 పదాలకు మించినది మాత్రం కాకూడదు.
అంత కంటే ఎక్కువుంటే ఏం చేయాలి?
మీరు పంపండి. మేం కాస్త ఎడిట్ చేస్తాం. కంటెంట్ మాత్రం మార్చం బాస్. వెబ్ సైట్ లో యాజ్ ఇట్ ఈజ్. ప్రింట్ లో మాత్రం.. కట్టింగ్ తప్పదు.
పంపిన ప్రతిదీ పబ్లిష్ చేస్తామన్న గ్యారెంటీ ఉందా?
లేదు. అలాంటి గ్యారెంటీ లేదు.
నేను రాసిన ఆర్టికల్ ఎప్పుడు పబ్లిష్ అవుతుంది?
సారీ.. ఇప్పుడే చెప్పలేం.
మేం రాసింది ఎడిట్ చేస్తారా?
యస్. ఎడిట్ చేస్తాం. ప్రూఫ్ రీడింగ్ ఉంటుంది. గ్రామర్ చూసి గ్లామర్ సెట్ చేస్తాం. కానీ మీ కాన్సెప్ట్ మాత్రం మార్చం.
ఓకే.. నాకు మొత్తం అర్థమైంది? మరెలా మొదలు పెట్టాలి?
ఇందుకోసం త్వరలో ప్రారంభం కానున్న జింకీ వెబ్ సైట్ ని సందర్శించండి. 

Who runs ZinkY?


ZinkY magazine is looking for New and Fresh Talent.

జింకీని నడుపుతున్నది తల పండిన మేథావులు కాదు. మీలాంటి వాళ్లే. మీకు రాయాలని ఉందా? అయితే మీరూ జింకీలో భాగమే. కేవలం రాతలే కాదు. మీ ఆలోచనలను, ఐడియాలనూ జింకీతో పంచుకోవచ్చు. జింకీకి ఓ టీమ్ ఉంది. మీరూ అందులో చేరొచ్చు. జింకీకి ప్రతి కాలేజీలో రిపోర్టర్లు ఉన్నారు. ప్రతి క్యాంపస్ లో కరెస్పాండెంట్లను కూడా నియమిస్తోంది. మీరూ మీ కాలేజ్ కరస్పాండెంట్ కావొచ్చు.
మా టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే త్వరలో ప్రారంభం కానున్న జింకీ వెబ్ సైట్ ని క్లిక్ చేయండి. పూర్తి వివరాలు మీకు దొరుకుతాయి? 

Why ZinkY?


జింకీ అనేది యూత్ కోసం యూత్ నడుపుతున్న ఇన్నోవేటివ్ మ్యాగజైన్. ఇది యువతరాన్నే కాదు, ప్రతి ఒక్క కాలేజీనీ కలుపుతుంది. ప్రతి విద్యార్థి ఇందులో తన వాయిస్ వినిపించొచ్చు. మీరు రాయండి. మేం పబ్లిష్ చేస్తాం. మీకు ఆసక్తి ఉంటే మా టీమ్ లో కూడా చేరొచ్చు. మీరు అనుభవం ఉన్న వారై ఉండక్కర్లేదు. మీ మనసులో ఉన్నది మాతో, మన నెట్ వర్క్ తో పంచుకోవాలనుకుంటే చాలు. మీ ఆలోచనలకు, ఆసక్తులకు, ఆకాంక్షలకు, అభిప్రాయాలకు జింకీ ఒక వేదిక. యూ రైట్.. వి పబ్లిష్... Because, This is your magazine. 

Wednesday, February 26, 2014

For the youth, by the youth, to the youth.

ZinkY is an interactive invention for telugu youth. 

ZinkY.. means Zero Ink Youth.

తెలుగు యూత్ కోసం తొలి మీడియా ZinkY. యువతరం Like చేసే అంశాలతో అందంగా డిజైన్ చేసిన అల్టిమేట్.. ఆల్ట్రా మోడ్రన్.. మ్యాగజైన్ మీ ముందుకు వస్తోంది. జింకీ ఎప్పుడూ హెడ్ లైన్స్ రాయదు. బ్రేకింగ్ న్యూస్ ఇవ్వదు. ఐస్ ఆన్ ది కేక్ టైప్ లో గ్రామర్ కు గ్లామర్ యాడ్ చేసి యంగ్ ఫ్లేవర్ తో ఎంటర్ టైన్ మెంట్ వేలో ఖతర్నాక్ కంటెంట్ ఇందులో ఉంటుంది. చాదస్తపు రాతలు ఉండవు. సరిహద్దుల గీతలూ కనబడవు. ఇక్కడ నో రూల్స్. మన వార్తల్ని మన స్టయిల్లో చదువుకుందాం. మనకో లింగో ఉంది. పేపర్ లో న్యూస్ బోర్ చదవబుల్ గా లేకపోతే ఇటు రండి. టీవీ లో వ్యూస్ చూడబుల్ గా లేకపోతే ఇక్కడ క్లిక్ చేయండి. ఫేస్ బుక్ లో ఫేస్ పెట్టినట్లు.. ట్విట్టర్ లో ట్వీట్ కొట్టినట్లు రాసుకుందాం. రండి.. రచ్చ రచ్చ చేద్దాం.

coming soon..

like the page.. share the buzz.. and we will roooooooooooccccccccckkkkkkkkkk DUDES.